Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను తెలుగు తెరకి రావడానికి కారణం భానుచందర్: సుమన్

  • భానుచందర్ తో ఓ తమిళ మూవీ చేశాను 
  • తెలుగు సినిమాలు చేయమని ఆయనే చెప్పాడు 
  • 'తరంగిణి'తో తొలి హిట్ పడింది    
తెలుగు తెరపై యాక్షన్ హీరోలుగా ఎక్కువ మార్కులు కొట్టేసినవారిలో సుమన్ ముందు వరుసలో కనిపిస్తాడు. మంచి హైట్ .. అందుకు తగిన పర్సనాలిటీ ఉండటం .. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉండటం వలన, ఆరంభంలో ఆయన యాక్షన్ సినిమాలను ఎక్కువగా చేశారు. అలాంటి సుమన్ తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

"నేను .. భానుచందర్ ఓ తమిళ సినిమాలో కలిసి నటించాం. ఆ సినిమాలో నేను హీరో అయితే తాను విలన్. అలా ఆ సినిమా చేస్తున్నప్పుడే మా మధ్య పరిచయం ఏర్పడింది. తెలుగు సినిమాల్లో ట్రై చేయమని అప్పుడే ఆయన నాకు సలహా ఇచ్చాడు. తెలుగులో తప్పకుండా రాణిస్తావని ప్రోత్సహించాడు. అయితే తెలుగు భాష సరిగ్గా రాకపోవడం వలన నేను సందేహించాను. 'అదే వస్తుంది .. దాని గురించి ఆలోచించకు' అంటూ నాకు ధైర్యం చెప్పాడు. అలా తెలుగులోకి వచ్చిన నాకు 'తరంగిణి' సినిమాతో పెద్ద హిట్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.      
suman
bhanuchandar

More Telugu News